శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:-
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు సమస్యలు పట్టించుకోకుండా రైతాంగానికి ఎంతో అండగా ఉంటున్నామని కూటమి ప్రభుత్వం తీరు పై వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ధ్వజమెత్తారు. శంఖవరం మండలం కొంతంగి పంచాయితీ కొత్తూరు గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ముద్రగడ గిరిబాబును కలిశారు. గిరిబాబు మాట్లాడుతూ గ్రామంలో పార్టీని బలోపేతం చేసి వైసిపి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు రాయపురెడ్డి చంటి, మరపరెడ్డి మంగారావు, మరపరెడ్డి శ్రీను,అకేటి శ్రీను, పలివెల నాగేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.