మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉమ్మడి మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, సీఎం రిలీఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికీ అందే విధంగా ఉండేలా చూడడం మా ప్రధాన ధ్యేయం.ప్రతి కార్యకర్త, అధికారి ఈ సంక్షేమ పథకాలను అందరూ సమర్థవంతంగా అందుకోవాలనీ కృషి చేయాలని నేను కోరుతున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బిక్షపతి,సవైయి సింగ్, ఎంపీడీవో అనిత,నాయకులు లోక్య నాయక్, నాగభూషణం గౌడ్,ఆకాశ్,అనిస్,ఖాళీక్, ప్రజా పండరీ,రఫీ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.