చిత్తూరు సెప్టెంబర్ 6 మన న్యూస్
ఎస్వీ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ద్వారా నిర్వహించే పీజీలో వివిధ కోర్షులకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎస్వీ కళాశాల చిత్తూరు, (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) స్టడీ సెంటర్ ఇంచార్జ్ కోఆర్డినేటర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రవేశాలకు సంబంధించిన రెండేళ్ల కాల వ్యవధిలో పీజీ కోర్సులకు ఎదురుచూస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కలదని అందుబాటులో ఉన్న పీజీ కోర్సులు (ఎం ఎస్ సి), (ఎంబీఏ), (ఎం కామ్), (ఎంఏ), (ఎమ్మెస్ డబ్ల్యూ), (ఎం ఎల్ ఐ సి), లలో సర్టిఫికెట్ గల కోర్సులను ఎస్ వి యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం అందించే పీజీ కోర్సు లు, విద్యార్థులకు విలువలు, జ్ఞానాన్ని, నైపుణ్యాలను, అందించి భవిష్యత్తులో మంచి కెరీర్ సాధించడానికి తోడ్పడతాయని, విద్యార్థులకు ఆసక్తులకు అనుగుణంగా అనేక రకాల పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. దూరవిద్య కేంద్రం అడ్మిషన్లు తేదీ మరొకసారి ఎలాంటి అదనపు రుసుం లేకుండా ఈనెల సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించిందని తెలిపారు. దరఖాస్తుల కొరకు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ఫోన్ నెంబర్ 9177696071, సంప్రదించి దరఖాస్తు పొందవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.