వింజమూరు సెప్టెంబర్ 6 :(మన ద్యాస న్యూస్) :///
వింజమూరు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు బీసీ వెల్ఫేర్ హాస్టల్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ కమిటీ అధికారుల తో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గం లోగల బీసీ హాస్టల్ ల స్థితిగతుల గురించి, విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందుతున్న సదుపాయాల గురించి, మెరుగైన విద్య, భోజన మరియు వసతి సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వింజమూరు బీసీ వెల్ఫేర్ హాస్టల్ నందు చదువుతున్న మన ప్రాంత విద్యార్థులు పదవ తరగతి నందు 600 మార్కులకు గాను 584 మార్కులను సాధించి జిల్లాలోనే మొదటి ర్యాంకును, ఇంటర్మీడియట్ నందు 1000 మార్కులకు గాను 962 మార్కులను సాధించి జిల్లాలోనే రెండవ ర్యాంకును సాధించారని అధికారులు గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేశారు.