కాణిపాకం సెప్టెంబర్-5 (మన ధ్యాస): చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం లో గల శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈఎస్. ఇంద్రేష్, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌతు శిరీష, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఐ.ఏ.ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీన్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరందరు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్, ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, కార్యదర్శి కోదండపాణి, దేవాలయ తనిఖీ అధికారి చిట్టిబాబు, కానిపాకం ఎస్.ఐ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరునసారిక, చిత్తూరు కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.