మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
2019 నుండి 2024 కాలంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించడం జరిగింది. గతoలో ఐదు ప్రభుత్వమెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది.గత సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలను, ఈ సంవత్సరం ఏడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ప్రారంభోత్సవం చేయవలసి ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం పనులు నిలిపివేసి మెడికల్ కాలేజీలను పి. పి. పి. పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తo చేసే ప్రయత్నం చేయడం పేద,మధ్యతరగతి వారి విద్యా అవకాశాలకు చేటు చేస్తుంది కాబట్టి ఆ నిర్ణయాన్ని పునరాలోచించుకొని జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించటం కొనసాగించాలని కోరుచున్నాము.ఈ కూటమి ప్రభుత్వ విధాన నిర్ణయం లోపం వల్ల గత సంవత్సరం విద్యార్థులు 750 ప్రభుత్వ సీట్లను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటైన విషయం.
1983 నుంచి తెలుగుదేశం పార్టీ వారి ప్రభుత్వ హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని స్థాపించలేదు. డా. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు మరియు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించే ప్రయత్నం చేయటం జరిగింది.
ఈ 17 మెడికల్ కాలేజీ పూర్తయినట్లైతే సుమారుగా 2500 సీట్లు పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలు అడిఅశలైనాయి.