మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, విద్యా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా, తనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ అవార్డు నా వ్యక్తిగత విజయమే కాకుండా, నా విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యం అందరి సహకారం ఫలితమని అంబటి బ్రహ్మయ్య అన్నారు.
తన ప్రయాణంలో ప్రోత్సాహం, మార్గనిర్దేశం అందించిన విద్యా శాఖాధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గుర్తింపు భవిష్యత్తులో మరింత కృషి చేయడానికి, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి నన్ను ప్రేరేపిస్తుందని అన్నారు
శుక్రవారం కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం లో కలెక్టర్,దామచర్ల సత్య,సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయకుమార్,డి.ఈ.ఓ.కిరణ్ కుమార్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
డీసీఈబి సెక్రటరీ మర్రిబోయిన శ్రీనివాసులు,మండల విద్యాశాఖాధికారులు కత్తి శ్రీనివాసులు,బడితల హరే రామ్,ఉపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు,జాలరత్నం,మాలిరావు,అంబటి ప్రసాద్,పంతగాని వెంకటేశ్వర్లు,సుధాకర్,ముజాఫర్,సుధాకర్ రెడ్డి,పాల్గొని అభినందనలు తెలిపారు.