మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో నెల్లూరు నుండి ఒంగోలు వైపు వెళ్తున్న రెనాల్ట్ డస్టర్ కారు (నంబర్ AP31BZ 1116) టోల్ గేట్ దాటిన 100 మీటర్ల దూరంలో అకస్మాత్తుగా ఇంజిన్లో పగలు వచ్చి మంటలు చెలరేగాయి.
దీంతో కారు ఇంజిన్ పూర్తిగా దగ్ధమైంది. అయితే కారులో ఉన్న వద్దినేని నరసింహారావు, ఆయన భార్య, కుమారుడు అపాయాన్ని తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ గాయాలు కాకపోవడం అదృష్టకరంగా మారింది.సమాచారం అందుకున్న టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.