మన ధ్యాస, నిజాంసాగర్,(జుక్కల్, )సెప్టెంబర్ 5:
జాసనే ఈద్–ఈ–మీలాద్ ఉన్ నబీ 1500వ జన్మదినోత్సవం సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జుక్కల్ ముస్లిం సోదరులు,స్థానిక యువకులు కలిసి నిర్వహించారు.రోగులకు పండ్లు అందజేసిన అనంతరం వారు ప్రవక్త ముహమ్మద్ బోధనలు,ఉపదేశాల గురించి మాట్లాడారు.ప్రవక్త సమానత్వం,సౌభ్రాతృత్వం, మానవతా విలువలను నేర్పారని గుర్తుచేశారు. స్త్రీ–పురుషుల మధ్య ఎలాంటి తేడాలు లేవు.జాతి, మతం,కులం అనే భేదాలు మనుషులను విడదీయలేవు. ప్రతి ఒక్కరూ సమానులే అని ఆయన చెప్పిన సందేశాన్ని నేటి తరానికి చేరవేయాలని సూచించారు.సమాజంలో ఒకరి కష్టాలు మరొకరు పంచుకోవడం,అనాధలను ఆదుకోవడం,తల్లిదండ్రులను గౌరవించడం వంటి విలువలను ఆయన తన జీవితం ద్వారా చూపించారని పేర్కొన్నారు.
జాసనే ఈద్–ఈ–మీలాద్ ఉన్ నబీ పండుగను ప్రతి సంవత్సరం రబీ ఉల్ అవ్వల్ నెల 12వ తేదీన విశేషంగా జరుపుకుంటామని తెలిపారు. సమాజంలోని ప్రతిఒక్కరికీ ప్రేమ,సహన భావాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో షేక్ పీర్దోస్, మొహమ్మద్ ఫారుక్, మొహమ్మద్ హైమద్, షాదుల్, ఇస్మాయిల్,సోహెల్, బజరంగ్, సాయి కర్ణ,అర్మాన్, అజయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.