మన ధ్యాస ,నెల్లూరు ,సెప్టెంబర్ 4 :*99 మందికి రూ.73.97.లక్షలు మంజూరు. నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో గురువారం బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్.ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ...............కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 379 మందికి రూ.4 కోట్లు సాయం అందించాం అని అన్నారు.వైసీపీ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయనిధి అనే పదాన్ని ప్రజలు మరిచిపోయారు అని అన్నారు.జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుతో డబ్బులు రాక విసుగెత్తిపోయిన కిమ్స్(బొల్లినేని), అపోలో వంటి ఆస్పత్రుల వారు ఆరోగ్యశ్రీ కింద సేవలందించలేమనే పరిస్థితికి వచ్చారు అని తెలిపారు.ఫలితంగా ప్రజలు అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు అని అన్నారు.ఆ బిల్లులను ముఖ్యమంత్రి సహాయనిధికి పెడితే సీఎం చంద్రబాబు నాయుడు ఉదారంగా సాయం అందిస్తున్నారు అని అన్నారు.ఒక్కో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల సాయం అందుతోంది అని అన్నారు.అనంతరం షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ............సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది అని అన్నారు.గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ పథకం నుంచి చాలా ఆస్పత్రులు వైదొలిగాయి అని అన్నారు.చెన్నైలోని అడయార్ కేన్సర్ ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్లినా ఏపీ ప్రభుత్వం బకాయిలు కట్టదనే పరిస్థితి తెచ్చారు అని అన్నారు.ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య శ్రీ పథకంపై బాధ్యత చూపకుండా గత పాలకులు నిర్లక్ష్యం చేశారు అని అన్నారు.ప్రభుత్వం నుంచి ప్రజలకు సాయం అందించడంలో సోమిరెడ్డి ముందుంటారు అని అన్నారు.ప్రస్తుత రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో రూ.4 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద తేవడం అంటే చిన్న విషయం కాదు అని అన్నారు.ప్రాణాలను కాపాడుకునేందుకు ఆస్తులు, బంగారు నగలు తాకట్టుపెట్టడంతో పాటు వడ్డీలకు అప్పులు తెచ్చిన వారికి ఈ ఆర్థికసాయం పెద్ద ఊరట అని అన్నారు.ఇటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, నాయకులకు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని అన్నారు.