మన ధ్యాస ,నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 4 :నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు వెంగళరావు నగర్ బి బ్లాక్ నందు సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది అనే వినూతన కార్యక్రమం 2వ రోజు డివిజన్ టిడిపి అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు చేపట్టడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు పథకాలు, వారికి వివరించి ఏవైనా సమస్యలు ప్రజలు చెప్తే వాటిని పరిష్కరించే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది.ఈ యొక్క కార్యక్రమంలో టిడిపి నాయకులు, డివిజన్ యూనిట్ ఇన్చార్జీలు కర్నాటి పవన్, కో యూనిట్ ఇన్చార్జీలు అంతోటి అశోక్, బూత్ ఇన్చార్జీలు ఆనంద్, చిన్న, మౌలాలి, బూత్ కమిటీ సభ్యులు దయాకర్, షఫీ అందరూ పాల్గొనడం జరిగింది.