కాణిపాకం, మన ధ్యాస సెప్టెంబర్ 5:
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు రాత్రి అశ్వ వాహన సేవ వైభవంగా జరిగింది. అర్చకులు స్వామి వారి మూల విరాట్ కు పూజలు చేసి ఊరేగింపు గా తీసుకువచ్చి అశ్వ వాహనంపై ఉంచి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీ వినాయక స్వామి వారిని కాణిపాకం గ్రామ పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారి కటాక్షం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సాహంగా ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్, అశ్వ వాహనం ఉభయదారులు వినాయక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.