ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గురజాల ,జగన్మోహన్ గజమాలతో స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు
మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- పెనుమూరు వ్యవసాయ సహకార మార్కెట్ యార్డ్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు.వీరికి టిడిపి శ్రేణులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. గంగాధర నెల్లూరు మండలం కేంద్రం చిత్తూరు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అక్కడ నుండి పెనుమూరు మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి.ఎం థామస్ మాట్లాడుతూ నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న అందరూ కష్టపడి భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కృషి చేయాలి అన్నారు. రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కూటమి విజయానికి తోడ్పడాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఓ చిన్న పొడుపు కథను చెప్పి తాను చిత్తూరు ఎమ్మెల్యే ఎన్ని వాడిదొడుకులు వచ్చిన ఎన్ని అడ్డంకుల సృష్టించిన అభివృద్ధి దూసుకుని పోతున్నామని తాము ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు అనంతరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కృష్ణమ నాయుడు, పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ చైర్మన్ సిఆర్ రాజన్, మాజీ జెడ్పీ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్, జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, యువ నాయకుడు హరీష్, తాళ్లూరి శివ,ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.