మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మత్స్య సంపద పెంచేందుకు కృషి చేస్తుంది అని ప్రకాశం జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, CH.శ్రీనివాసరావు తెలియజేసినారు.
సింగరాయకొండ మండలం లోని పాకల పోతయ్య గారి పట్టాపుపాలెంలో, పాకల పల్లిపాలెం గ్రామంలో చేపల అధిక ఉత్పత్తి మరియు బోటు ఇంజన్ మెకానిజం పై మత్స్యకారులకు శిక్షణ కార్యక్రమం ఆత్మ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి CH శ్రీనివాసరావు, మత్స్య అభివృద్ధి అధికారి, సింగరాయకొండ కె .గౌరీ శంకర్, డాక్టర్ ఇంద్రగంటి ఆంజనేయులు, మద్దులూరి.రమేష్ చేపలు అధిక ఉత్పత్తి మరియు చేపలు త్వరగా పాడవకుండా ఉండుటకు మరియు నూతన సాంకేతిక పద్ధతులపై, ఇంజిన్ టెక్నీషియన్ బాలకృష్ణ,ఆత్మ డిపార్ట్మెంట్, మత్స్యశాఖ అధికారులు పాల్గొనడం జరిగింది.
సముద్రపు నాచుముక్కల పెంపకం, కేజీల ద్వారా చేపల పెంపకం మరియు కాప్టివ్ ఫిష్ సీడ్ పాండ్స్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుటకు మత్స్యకారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.