ఉదయగిరి సెప్టెంబర్ 4 :మన ద్యాస న్యూస్ ప్రతినిధి :///
ఇటీవల టిడిపి నాయకుడైన మట్ల లక్ష్మయ్య ప్రమాదానికి గురై చెయ్యి విరగగా వారిని ఉదయగిరి మండల కేంద్రం లోని గొల్లపాలెం నందు గల వారి స్వగృహమునకు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదాలకు గురైన కూటమి కార్యకర్తలకు,కూటమి నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని కాకర్ల సురేష్ గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.