ఉదయగిరి సెప్టెంబర్ 4 : మన ద్యాస న్యూస్ ప్రతినిధి :///
ఉదయగిరి మండలం గంగులవారి చెరువుపల్లి మాజీ సర్పంచ్ కప్పా శ్రీనివాసుల రాజు దశదిన కర్మ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని వారి చిత్రపటమునకు పుష్పాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.