మన ధ్యాస ,విడవలూరు, సెప్టెంబర్ 3:*ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సమక్షంలో విడవలూరు, పార్లపల్లి, వరిణి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విడవలూరు గ్రామంలోని సాయిబాబా కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం విడవలూరు, పార్లపల్లి, వరిణి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. విడవలూరు సొసైటీ ఛైర్మన్ గా పొన్నలూరు పురంధర్ రెడ్డి సభ్యులుగా చింతగింజల కృష్ణ, తిరకాల నాగేశ్వరరావు పార్లపల్లి సొసైటీ ఛైర్మన్ గా వేగూరు చంద్ర , సభ్యులుగా బత్తిన రామసుబ్బారెడ్డి, సిహెచ్ కామేశ్వరమ్మ, వరిణి సొసైటీ ఛైర్మన్ గా కొడిమెర్ల వెంకటేశ్వర్లు, సభ్యులుగా నాటారు విజయకుమార్, కుడుముల వెంకటస్వామి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ........ సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మాత్రమే సాధ్యమన్నారు. వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధులుగా పనిచేయాలని పదవులు స్వీకరించిన నాయకులకు ఆమె దిశా నిర్దేశం చేశారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ రైతులకు అండగా నిలవాలని కోరారు. అన్నదాతలకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు ఇతర సంక్షేమ పధకాల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు సుభిక్షంగా వున్నారని గతంలో ఎన్నడూ లేని విధంగా జలాశయాలు నీళ్లతో కళ కళ లాడుతున్నాయన్నారు. గత సీజన్లో రైతుల నుంచి ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు ధాన్య సేకరణ చేయడమే కాకుండా ధాన్యం సేకరణ చేసిన 24 గంటలలో హమాలీ కూలీలతో సహా చెల్లించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మరియు పౌరసరఫరాల శాఖ మంత్రితో మాట్లాడి రెండో పంటకు సంబంధించిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి చేస్తానన్నారు. ఎన్నికల సందర్భంగా చెప్పిన సూపర్ సిక్స్ లో దాదాపు 90 శాతం అమలు చేశామని రైతులను ఆదుకునేందుకై అన్నదాత సుఖీభవ పధకాన్ని అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో విడవలూరు మండల టిడిపి అధ్యక్షులు ఏటూరి శ్రీహరి రెడ్డి, తెలుగుదేశం నాయకులు చెముకుల శ్రీనివాసులు, పాశం శ్రీహరి రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, సత్యంరెడ్డి, పూండ్ల అచ్యుత్ రెడ్డి, ఆవుల వాసులతో పాటు టిడిపి క్లస్టర్ మరియు యూనిట్ ఇంచార్జీలు పాల్గొన్నారు.