గద్వాల జిల్లా మన ధ్యాస న్యూస్ సెప్టెంబర్ 3: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో, పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా ఉన్న రైల్వే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీకే అరుణ ఇచ్చిన ప్రతిపాదనలపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు...సమావేశంలో ప్రస్తావించిన ప్రధాన అంశాలివే..గద్వాల పరిధిలోని రైల్వే ప్రయాణికుల ఇబ్బందులు..15. గద్వాలలో వందేభారత్ ట్రైన్ ఆపాలి సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలో చర్యలు తీసుకుంటామని వివరణ16. జైపూర్ - మైసూర్ ట్రైన్ ను గద్వాల స్టేషన్ లో ఆపాలి. 17. గద్వాల రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న 112 ఎకరాల స్థలం ఖాళీగా ఉంటోంది. దానిని వినియోగంలోకి తీసుకొస్తూ.. రైల్వే క్వార్టర్స్, ఇతర నిర్మాణాలు చేపట్టాలి. 18. అమృత్ భారత్ స్టేషన్ పతకం కింద గద్వాల రైల్వే స్టేషన్ లో వి ఐ పి లాంజ్ ఏర్పాటు చేయాలి. 19. గద్వాల రాయచూర్ ట్రైన్ సమయాన్ని పెంచాలి.20.గద్వాల - డోర్నకల్ రైల్వే ఫైనల్ లొకేషన్ సర్వే పురోగతి ఏమిటి డీపీఆర్ బోర్డు పరిశీలనలో ఉన్నట్లు తెలిపిన అధికారులుఉమ్మడి పాలమూరు జిల్లా రైల్వే సమస్యల పై..1. కృష్ణా - వికారాబాద్ రైల్వే లైన్ పనుల్లో పురోగతి పై ఆరా, త్వరగా పూర్తి చేయాలని సూచన. 2. హైదరాబాద్ - కర్నూల్ వెళ్ళే హంద్రీ ఎక్స్ ప్రెస్ మలక్పేట్ లో ఆపాలి. 3. ప్రయాణికుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని కాచిగూడ - రాయచూర్ వెళ్లే రైలు సమయాన్ని మరింత ముందు వచ్చేలా చూడాలి. 4. దేవరకద్రలో ఆర్ యు బి కోసం ఇప్పటికే ప్రత్తిపాదనలు పంపాము, పురోగతి ఏమిటి.., త్వరగా పూర్తి చేయాలి. 5. అయినాపూర్ - చేగుంట వెళ్లే రూట్లో ఆర్ యు బి, మహబూబ్ నగర్ మూతి నగర్ తో పాటు చాలా చోట్ల ఆర్ యు బిలలో నీళ్లు నిండుతున్నాయి పరిష్కారం చూపాలి. 6. చటాన్ పల్లి ఫ్లైవర్ ఎందుకు ఆలస్యం అవుతోంది.. నిర్మాణం పనులలో పురోగతి ఏమిటి..7. దేవరకద్ర, కౌకుంట్ల, మహబూబ్ నగర్ లోని మోతినగర్, రైల్వే గేట్, జడ్చర్ల, మక్తల్ పరిధిలో వద్ద ఆర్ యు బి ఆర్ ఓ, బి, ల నిర్మాణాలు, పురోగతిపై ఆరా, త్వరితగతిన పూర్తి చేయాలని సూచన. 8. మక్తల్ నియోజకవర్గం కృష్ణ రైల్వే స్టేషన్లో చెన్నై - ముంబై ఎస్ పి ఎఫ్ ట్రైన్ ఆపాలి ప్రతిపాదనలు పరిశీలిస్తామన్న అధికారులు9. కురునర్తి స్టేషన్ లో ప్లాట్ ఫామ్స్ పెంచాలి. 10. తాండూర్ - మహబూబ్ నగర్ కనెక్టివిటీలో భాగంగా కొత్త రైల్వే లైన్ కోసం సర్వే చేయాలి. 12. ఎంఎంటిఎస్ ట్రైన్ లను ఉందానగర్ నుంచి షాద్ నగర్ వరకు పెంచాలి సబర్బన్ పరిధిలోకి షాద్ నగర్ రానందున ఎక్స్టెండ్ చేయలేకపోతున్నట్లు వివరణ ఇచ్చిన అధికారులు13. మహబూబ్ నగర్ నుంచి కర్నూలు వెళ్ళడానికి మధ్యాహ్నం తర్వాత కొత్త రైలు వేయాలి డబ్లింగ్ పనులు అవుతున్నందున సాధ్యపడటం లేదని వివరణ14. వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ లో కాచి గూడ చెంగల్ పట్టు & కాచిగూడ - పూదుచ్చేరితో పాటు మరికొన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆపాలి ఈ ప్రతిపాదనలు బోర్డు పరిశీలనలో ఉన్నట్లు వివరణ