మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 2:రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. మంగళవారం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ తదితరులు నెల్లూరులోని విపిఆర్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టడంతో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని చెప్పారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. వేంకటేశ్వరస్వామివారి ఆశీసులు పవన్ కల్యాణ్‌పై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ మాట్లాడుతూ...... జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అటు పార్టీని పటిష్టం చేస్తూనే... రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని వివరించారు. పేద ప్రజల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోవూరు జనసేన ఇన్‌ఛార్జి గుడి హరిరెడ్డి, టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, కోడూరు కమలాకర్‌రెడ్డి, బెజవాడ వంశీరెడ్డి, సుందరరామిరెడ్డి, వీర మహిళలు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.