మన న్యూస్: నిజాంసాగర్,జుక్కల్ నిజాంసాగర్ మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పడిన రేషన్ షాప్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి రేషన్ షాప్ ను ప్రారంభించారు. బియ్యాన్ని కంట పై పెట్టి లబ్ధిదారులకు బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా రేషన్ డీలర్ రహమాన్ ఎమ్మెల్యేకు శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు రేషన్ బియ్యాన్ని అందజేయాలని డీలర్ ను ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి,తహశీల్దార్ బిక్షపతి,నాయకులు నాగభూషణం గౌడ్,మల్లప్ప పటేల్,శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.