మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలో దివంగత నేత, ప్రజానేత, ఆరోగ్యశ్రీ ప్రధాత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా సింగరాయకొండ పంచాయతీ కందుకూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద ఘనంగా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, వైస్సార్సీపీ పి.ఏ.సి సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో సింగరాయకొండ మండల వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.