కలిగిరి,మన ద్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు : సెప్టెంబర్ 2 :////
కలిగిరి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయగిరి నియోజకవర్గం పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బద్దినేని శివ, కృష్ణoశెట్టి దిలీప్ కుమార్ ,కోసూరి సురేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు కార్యక్రమాన్ని ముందుగా కలిగిరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 73 యూనిట్లు రక్తం సేకరించినట్లు నోవా బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్ బావిశెట్టి కిషోర్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న 73 మంది సభ్యులకు ఆర్గనైజేషన్ సభ్యులకు జనసైనికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద స్థాయిలో 73 యూనిట్లు రక్తం సేకరించడం చిన్న విషయం కాదని ఇన్ని యూనిట్లు రావడం ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కోసూరి సునీల్, దాసరి గణేష్, బత్తల శ్రీనివాసులు, పొన్నం నాగేశ్వరరావు మరియు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.