గూడూరు:- అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ప్రతిపక్షాలు పెన్షన్లు పూర్తిగా తొలగిస్తున్నామని అవాస్తవా ప్రచారాలు చేస్తున్నాయని వాటిని నమ్మవద్దని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కోరారు . గూడూరు పట్టణంలోని 16వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు .అనంతరం పోలేరమ్మ ఆలయం వద్ద పూజలు, నిర్వహించి పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తిని ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా గెలిచిన వెంటనే పెన్షన్లను పెంచడం జరిగిందని గుర్తు చేశారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ ,రైతుకు ఆర్థిక సహాయం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ ,బిల్లు చెంచురామయ్య శివకుమార్ ,సుమన్, పావని ,ముని గిరీష్, రవీందర్ రెడ్డి ,ప్రణీత్ యాదవ్, జహంగీర్ , రహీం ,ఇజ్రాయిల్ ,సురేంద్ర అమరయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు .