ప్రజారంజక పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం.......... రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ- నెల్లూరు నాలుగో డివిజన్లో పెన్షన్లను పంపిణీ చేసిన రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ - డివిజన్ కు విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన పెన్షన్ దారులు, స్థానిక టిడిపి నేతలు, ప్రజలు- రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల మొదటి తారీఖున పెన్షన్ల పంపిణీతో పండగ వాతావరణం నెలకొందన్న మంత్రి- రాష్ట్రవ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు రూ.2746.52 కోట్ల పైన పింఛన్లు అందజేత- పెన్షన్ల పంపిణీ తొలి రోజున 99 శాతం పింఛన్ల పంపిణీ పూర్తవుతుందని మంత్రి వెల్లడి- సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన కూటమి ప్రభుత్వం- ప్రజల సంతోషమే సీఎం చంద్రబాబు లక్ష్యం- రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 1:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నాలుగో డివిజన్ లోని దీన దయాల్ నగర్ లో సోమవారం ఉదయాన్నే పలువురు పింఛన్ లబ్ధిదారులకు మంత్రి నారాయణ సామాజిక పింఛన్లను అందజేశారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రికి పెన్షన్ దారులు, టిడిపి శ్రేణులు, స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి ముందుకు సాగారు. పెన్షన్ దారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్న తనతో నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ........ రాష్ట్రంలో 63 ,61,380 మందికి నేడు సుమారు రూ.2746.42 కోట్ల పైచిలుకు పెన్షన్ నగదును అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తొలి రోజునే 99 శాతం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఈ పరిస్థితి లేదని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు అని మంత్రి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన దిశగా అడుగు వేస్తున్నదని హామీలను పూర్తి చేయడం జరుగుతుందని సూపర్ సిక్స్ పథకాలు పూర్తి చేశామని మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే సామాజిక పింఛన్లను 4000 రూపాయలకు పెంచి మూడు నెలల ఎరియర్స్ తో కలిపి ఒకేసారి 7000 రూపాయలు నగదు చెల్లించడం జరిగిందన్నారు. అంతేకాకుండా మహిళల అభ్యున్నతికి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు మరియు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతు సోదరులకు 20,000 రూపాయలు వంతున జమ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి సుమారు 67 లక్షల మంది లబ్ధిదారులకు 15వేలు రూపాయలు వంతెన చెల్లించడం జరిగిందన్నారు. స్త్రీ శక్తి పథకం మంచి విజయాలను అందుకునిందని నిన్న జరిగిన ర్యాలీలో మహిళలు సుమారు పదివేల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని విజనరీ నేత, సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్మన్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు చెప్పినవన్నీ చేయడంతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని కొనియాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ సూపర్ సిక్స్ లో భాగంగా పెన్షన్ నగదు పెంపుదల చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలన నిర్వాహకం కారణంగా ఖజానా ఖాళీ అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చంద్రబాబు అపారమైన అనుభవంతో నిలబెట్టుకున్నారని తెలియజేశారు. గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. అయితే భారతదేశంలో ఎక్కడ ఇంత భారీగా పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో పూర్తిగా అరాచక పాలన సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజా పరిపాలన అందిస్తూ మంచి ప్రభుత్వంగా ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మన ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని,వారి ఆనందానికి హద్దులు లేవని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమీషనర్ నందన్ ,డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ,మాజీ జెడ్పిటిసీ విజేతా రెడ్డి ,టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు ,డివిజన్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి ,టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు .