
మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్1: నెల్లూరులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ - మైపాడు గేట్ సెంటర్ స్మార్ట్ స్ట్రీట్ లో ఏర్పాటు చేసిన కంటైనర్లు పరిశీలన - బోడి గాడి తోటలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్క్ పనులు సందర్శన - గత ప్రభుత్వ చెత్త పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు - చెత్తపై కూడా పన్నులు వేసి వసూలు చేసి 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లారంటూ ఎద్దేవా - కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 78 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేసాం.. అక్టోబర్ రెండవ తేదీకి చెత్తనంతా తొలగిస్తాం - నెల్లూరు సిటీ అభివృద్ధికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా - మరో మూడు నెలల్లో సిటీలోని పార్కు పనులన్నీ పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ .ప్రజా అవసరాలను గుర్తించలేక, చేతగాని పరిపాలన చేసి, ఆఖరికి చెత్తపై కూడా పన్ను విధించిన చెత్త పాలన గత ప్రభుత్వానిదని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ లో స్మార్ట్ స్ట్రీట్ కంటైనర్ల ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పదిరోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు అనంతరం బోడిగాడితోటలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కు పనులను మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. పార్కు డిజైన్ ను మంత్రికి అధికారులు చూపించారు.మూడు నెలల్లో పార్కు పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.ఈ సందర్బంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ .........గత ప్రభుత్వం ప్రజావసరాలను గుర్తించలేదని చెత్త పరిపాలన సాగించిందన్నారు.. అరాచకంగా వ్యవవహరించిందని 85 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రానికి వదిలి వెళ్ళిందన్నారు. చెత్తపన్ను వసూలు చేసి చెత్త తొలగించటం మరిచిపోయిందని,అక్టోబర్ రెండో తేదీకల్లా చెత్తను తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. ఐతే ఇప్పటికే 78 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేసామన్నారు. ప్రజావసరాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అందరూ తమ ప్రాంతంలో మంచి పార్కు కావాలని కోరుకొంటున్నారన్నారు. అమరావతి రాజధానిలో గ్రీన్ అండ్ బ్లూకి 30 శాతం ప్రభుత్వం కేటాయించిందన్నారు.పేదలు నివసించే బోడిగాడి తోటలో అన్నిహంగులతో పార్కును సిద్ధం చేస్తున్నామన్నారు. పార్కులో కమ్యూనిటీ హల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్ కల్లా పార్కు పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని, పార్కు అభివృద్ధికి ముందుకొచ్చిన బాలాజీ సింగ్ కి అభినందనలు తెలియజేసారు.నెల్లూరు సిటీలో హామీలను మించి అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమీషనర్ నందన్, ఇంజినీరింగ్ విభాగాధికారులు, మాజీ జెడ్పిటిసీ విజేతా రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, డివిజన్ ప్రెసిడెంట్ గంగాధర్, టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు .



