మన ధ్యాస, వెదురుకుప్పం:- గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. గ్రామస్థుల ఆశీస్సులు అందుకున్న ఆయన మాట్లాడుతూ – ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం వృద్ధులు, విధవలు, దివ్యాంగులు వంటి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జీవనోపాధికి తోడ్పడేలా ఉందని పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికే చేరే విధంగా ఎన్టీఆర్ భరోసా ద్వారా పారదర్శకంగా పెన్షన్ పంపిణీ జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏ.ఈ. మధుసూదన్ రెడ్డి, పంచాయతీ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ విద్యాసాగర్, యువ నాయకుడు భాష్యం సతీష్ నాయుడు, బూత్ కన్వీనర్ బొగ్గల పవన్ కుమార్, పైని, స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ బాలాజీ, భాస్కర్, చందు మరియు అరగొండ మురళీమోహన రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ప్రజల ఉత్సాహపూర్వక హాజరుతో కార్యక్రమం విజయవంతమైంది.