
మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 31: ప్రభుత్వ అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా వృత్తి నిర్వహణలో విశిష్ట సేవలు అందించి, ప్రభుత్వ అవార్డులు ,ప్రశంసలు పొంది , నిజాయితీపరుడుగా, మంచి మనిషిగా అందరి మన్ననలు పొంది 31 ఆగస్టు 2025 పదవి విరమణ చేస్తున్న కొండపల్లి శివరామకృష్ణ శేష జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని వచ్చిన అతిథులు మాట్లాడారు. కొండపల్లి శివరామ కృష్ణ 1995 కావలి, అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా ఉద్యోగం ప్రారంభించి, 31 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా నేడు పదవి విరమణ చేయుచున్నారు.కొండపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ....... నా 31 సంవత్సరాలు ఉద్యోగ నిర్వహణలో నాకు సహకరించిన తోటి ఉద్యోగులకు, పై అధికారులకు, బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ నా కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఈ పదవి విరమణ సభకు విచ్చేసిన అటవీ శాఖ ఉద్యోగులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కొండపల్లి శివరామకృష్ణను అటవీ శాఖ ఉద్యోగులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.






