బద్వేల్ మన ధ్యాస న్యూస్/: ఆగస్టు 31:
బద్వేల్ పట్టణమునందు దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు-వైకల్య శాతం తగ్గింపు మరియు ఉచిత బస్సు పాసులకై దివ్యాంగుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం రఫీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వీరశేఖర్ గారు మరియు సిపిఐ బద్వేల్ పట్టణ కార్యదర్శి బాలు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతూ ..కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత దివ్యాంగుల పెన్షన్లు పెంచడం సంతోషం కానీ అదే పింఛన్లు భారంగా భావించి రాష్ట్రములో లక్ష్య మందికి పైగా వికలాంగులను తొలగించడం బాధాకరంగా ఉందన్నారు అలాగే వికలాంగుల వైకల్య శాతాన్ని తగ్గించటం సరైనటువంటి పద్ధతి కాదని సదరం సర్టిఫికెట్ల గురించి ఇచ్చిన వైకల్య శాతాన్ని గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదన్నారు గతంలో ఇచ్చిన వైకల్య శాతానికి ఇప్పుడు ఇచ్చిన శాతానికి పూర్తి భిన్నంగా ఉందన్నారు దీని ద్వారా అనేకమంది దివ్యాంగులకు ఉద్యోగాలు, ఉపాధి ఇతర సంక్షేమ పథకాల ఇబ్బందులు ఏర్పడతాయన్నారు.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన బోగస్ సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలించకుండా 2010 నుండి 2025 వరకు అందరినీ వైకల్య పరీక్షలు నిర్వహించి అనేకమంది నిజమైనటువంటి దివ్యాంగులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబాలలో పెన్షన్ పై ఆధారపడి జీవిస్తున్న అనేకమంది దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లే దివ్యాంగులకు ఉచిత బస్సు పాసుల సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు, కాళ్లు అవయవాలు లేని దివ్యాంగుల పెన్షన్లను తొలగించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు… రాష్ట్రంలో ఐదు లక్షల మంది దివ్యాంగులు ఉంటే వారికి పెన్షన్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఇప్పటికే లక్షమంది అనర్హులని వారి కి పెన్షన్లు లేకుండా చేయటం సరైనటువంటి విధానం కాదు అన్నారు. సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో జరిగినటువంటి వైకల్యం శాతాలను వైకల్య ప్రభావాన్ని బట్టి నిర్ధారించాలన్నారు. డాక్టర్లు డాక్టర్ల నిర్లక్ష్యానికి దివ్యాంగులు బలైపోతున్నారు ప్రభుత్వం చేసిన తప్పును సమర్థిస్తున్నారు ఇది మంచిది కాదు అన్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో ప్రధానంగా ఇళ్ల స్థలాల విషయంలో దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందన్న స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మంచిదే అందులో దివ్యాంగులను ఉచితంగా ప్రయాణించడం అనేది న్యాయబద్ధమైనటువంటి కోర్కె అన్నారు ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకోకపోతే దివ్యాంగుల పక్షాన నిలబడి పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ బద్వేల్ పట్టణ కార్యదర్శి పి బాలు , బద్వేల్ ఏరియా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ రమణ, బద్వేల్ రూరల్ కార్యదర్శి ఇమ్మానియేల్ సిపిఐ నాయకులు పి వెంకటరమణ, పొంగూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశం తదనంతరం దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేష్, పట్టణ అధ్యక్షులు చింతకుంట రఫీ, నాగూర్, కేశవయ్య, రమణయ్య, బాబు, సభ్యులను భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) లోకి కండువాతో ఆహ్వానించడం జరిగింది.