మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.సభను ఉద్దేశించి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే ప్రధాన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచనల మేరకు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే కాంగ్రెస్ విజయడంకా తప్పక మోగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మండలంలోని 13 గ్రామ పంచాయతీల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ గ్రామాల్లో ప్రతి ఇంటిని సందర్శించి, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులకు శాలువాలు కప్పి సత్కరించారు.ఈ సమావేశంలో మండల నాయకులు రమేష్ యాదవ్, లోక్య నాయక్, సవాయి సింగ్, నాగభూషణం గౌడ్, ఆకాష్, గొట్టం నరసింహులు, ఇఫ్తాకర్, కాలిక్, తాటిపల్లి సరస్వతితో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.