మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :
ఏలేశ్వరం 9 వార్డులో గణపతి ఉత్సవాల సందర్భంగా పల్లపు వీధి చిన్న యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి మహా ప్రసాదాన్ని వేలం పాట పాడుకుని అ మహా గణపతి దేవుడే ని కృప కు పాత్రుయ్యారు. ఈ సందర్భంగా పెచ్చేటి కృష్ణ (సిరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్) మాట్లాడుతూ ఈ మహా ప్రసాదాన్ని గత 8 సంవత్సరాలుగా దక్కించుకోవడం నా అదృష్టమని అన్నారు.ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వేలంపాటికి వస్తానని ఈ వేలంపాటి ద్వారా లడ్డు దక్కించుకోవడం మా కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో గంగిరెడ్ల బ్రదర్స్ అండ్ సన్స్,కమిటీ సభ్యులు,పల్లపు వీధి చిన్న యూత్ కుర్రాళ్లు పాల్గొన్నారు.