
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా అద్నాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా అద్నాన్ మాట్లాడుతూ..ఈ బాధ్యతను నాకప్పగించినందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసుధన్ రెడ్డి,జుక్కల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఇమ్రోజ్లకు కృతజ్ఞతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా,యువకులకు పార్టీ తరఫున ఎప్పుడూ అండగా ఉంటూ,వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను” అని తెలిపారు.యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, విద్యార్థి వసతి ద్రవ్య సహాయం వంటి పథకాలను ప్రతి యువకుడికి చేరవేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని అద్నాన్ పేర్కొన్నారు.
