మన ధ్యాస ,నెల్లూరు ,ఆగస్టు 30: నెల్లూరు 16 డివిజన్ లో గుర్రాలమడుగు సంఘం మిత్రమండలి ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై విగ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో 16 వ డివిజన్ ఇన్ చార్జ్ సగిలి జయరామి రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి,46 వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి.. భక్తులకు అన్నదానం చేశారు.నెల్లూరు నగరవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుండడంతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుందన్నారు.వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అనేకచోట్ల నిర్వాహకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ఎంతో సంతోషకరమన్నారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఈ రోజు గుర్రాల మడుగు సంఘంలోని శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవ కార్యక్రమానికి హాజరై.. పూజా కార్యక్రమాల్లో పాల్గొని.. ఆ విగ్నేశ్వరుని కృపా కటాక్షానికి పాత్రులవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.అలాగే ఈ కార్యక్రమంలో భక్తులకు అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని 16 డివిజన్ ఇన్ చార్జ్ సగిలి జయరామి రెడ్డి నిర్వహింస్తుండడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానికులు నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణ, సాంబి, నాగలక్ష్మి మస్తాన్, నరేంద్ర, పవన్, రామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, షరీఫ్, పార్థసారథి, సుకుమార్, దశరథ, నాని రాజేష్ తాహిర్, నజీన్ తదితరులు పాల్గొన్నారు.