మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-30: తవణంపల్లి మండలంలోని తవణంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, యూనిట్ ఇంన్చార్జి గాలి దిలీప్ కుమార్, లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి మాట్లాడుతూ పండుగ వాతావరణం లో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతోందన్నారు. సుపరి పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకాన్ని టెక్నాలజీని అందుపుచ్చుకొని అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు వినాయక, రాష్ట్ర తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్ శరవణ కుమార్, పార్టీ కార్యదర్శి వేలు శెట్టి, సంఘమిత్ర సుజాత గ్రామస్తులు పయని, చంద్రవేలు శెట్టి, రేషన్ షాప్ డీలర్, వీఆర్వో వెంకట ముని, గ్రామస్తులు పాల్గొన్నారు.