మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.మహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద నీటి ప్రవాహం వల్ల దెబ్బతిన్న ఇళ్లు,షెడ్లను ఆయన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతి బాధితుని నష్టం ఎంత జరిగిందో సర్వే చేసి,రిపోర్టులు తయారు చేసి తహసీల్దార్‌కు అందజేయాలి. ఆ వివరాల ఆధారంగా ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందిస్తాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఆర్ఐ పండరీ,నాయకులు హరిన్,నికిల్ తదితరులు పాల్గొన్నారు.