శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇరువురు ఎమ్మెల్యేలు..,!
వల్లేటివారిపాలెం:మనన్యూస్ ప్రతినిధి, నాగరాజు ఆగస్టు 30 :////
కందుకూరు నియోజకవర్గం లోని శ్రీ మాలకొండ క్షేత్రంలో వెలసి యున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తరించారు. శనివారాన్ని పురస్కరించుకొని, శ్రీ మాలాద్రి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించి శ్రీ మాలకొండ స్వామి కృపకు పాత్రులయ్యారు. అంతకుముందు స్వరంగా మార్గం ద్వారా నడిచి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. శ్రీ మాలకొండ స్వామి క్షేత్రం విశిష్టతను, అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు మధు మోహన్ రెడ్డి, చండ్ర మధుసూదన్ రెడ్డి, మరియు సీనియర్ నాయకులు పొన్నుబోయిన చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులు, భక్తులు, తదితరులు ఉన్నారు.