మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మంత్రి వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో క్రీడా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పిఈటిలను ఘనంగా సత్కరించినట్లు మక్తల్ పట్టణ అధ్యక్షుడు ఏ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సీఎం రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వరుసగా ఏడు రోజులపాటు క్రీడా వారోత్సవాలు నిర్వహించిందని అన్నారు.మక్తల్ పట్టణంలోనూ వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో క్రీడలను మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పీఈటీలను శాలువాలతో సత్కరించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా క్రీడా పాలసీని తీసుకొచ్చి, మారుమూల పల్లెల్లోని విద్యార్థులను సైతం మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులుగా ఎదిగేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారు కృషి చేస్తున్నారని అన్నారు.ఇటు మక్తల్ నియోజవర్గ కేంద్రంలో సైతం 25 కోట్లతో కనివిని ఎరుగని రీతిలో అన్ని రకాల సదుపాయలతో సరికొత్త హంగులతో స్టేడియం పునర్నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారని, దీంతోపాటు ఉట్కూరు, నర్వ, ఆత్మకూరు ,అమరచింతలో సైతం క్రీడా మైదానాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా మంత్రి వాకిటి శ్రీహరి చర్యలు చేపడుతున్నారని అన్నారు. కనివిని ఎరుగని రీతిలో మక్తల్ నియోజకవర్గం ను క్రీడా హబ్ గా ఏర్పాటు చేసేందుకు మంత్రి వాకిటి శ్రీహరి కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, ఎంఈఓ అనిల్ గౌడ్, డీఎస్ఓ వెంకటేష్ శెట్టి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, శ్రీహరన్న సేవా సమితి సభ్యులు మొహమ్మద్ నూరుద్దీన్, అస్సాముద్దీన్, ఫయాజ్, అబ్దుల్ రెహమాన్, అఫ్రోజ్, బోయ నరసింహ, అనంపల్లి రమేష్, అశోక్ గౌడ్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.