మన న్యూస్, ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం తయ్యురు గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయక స్వామి సత్యమును గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసి మూడు రోజులపాటు విశేష పూజలు అందించారు. మూడవరోజు స్వామివారి మేళ తాళాల నడుమ యువకులు ఉత్సాహంతో చిందులేస్తూ వినాయక స్వామి వారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు చిరంజీవి ,రాజేష్, గుణశేఖర్ ,అనంతరెడ్డి, వినాయక రెడ్డి, శ్రీనివాసులు, యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.