మన ధ్యాస యాదమరి ఆగస్టు 29: యాదమరి మండలం కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషదినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇన్చార్జి హెచ్.యం. జె.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ “తెలుగుభాష మన సంస్కృతికి ప్రతీక, విద్యార్థులు దానిని గౌరవంగా కాపాడుకోవాలి” అని తెలిపారు. ఈ సందర్భంగా పద్యాలాపన, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా స్పోర్ట్స్ దినోత్సవం కూడా జరిపారు. చివరగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరిని ఆకట్టుకున్నారు. ఈకార్యక్రమాన్ని తెలుగు విభాగ ఉపాధ్యాయులు యులు షణ్ముగం, మంజుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు మదన్ మోహన్ రెడ్డి, కనకాచారి, దామోదర రెడ్డి, మధుసూదన్, సుల్తాన్, సుధాకర్, అరుణ, నాగభూషణం, మంజులత, రంగనాధం, రమాదేవి, కె.భారతి, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.