మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామపంచాయతీ పరిధిలోని మరుపల్లి గ్రామం వరద ముంపుకు గురైన విషయం తెలిసిందే.గ్రామస్తులందరినీ మండల కేంద్రంలోని అచ్చంపేట్ సొసైటీ పరిధిలోని గోర్గల్ గేటు వద్ద ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి తరలించారు.ఈ శిబిరాన్ని మండల ప్రత్యేక అధికారి ప్రమీల సందర్శించి,గ్రామస్థుల పరిస్థితులను,వారి బాగోగులను తెలుసుకున్నారు.అక్కడ వారికి అందుతున్న భోజన వసతిని స్వయంగా పరిశీలించి గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు.అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించి, అవసరమైన వారికి వైద్య సేవలు అందించేందుకు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పంపేలా చర్యలు తీసుకున్నారు.తరువాత మండల కేంద్రంలోని వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్లను ఆమె తహసీల్దార్ బిక్షపతి,ఎంపీడీవో గంగాధర్ తో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి భీమ్రావు తదితరులు పాల్గొన్నారు.