నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూల పురుషుడు
నల్గొండ,ఖమ్మం,గుంటూరు కృష్ణాజిల్లా ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు
ఉరవకొండ, మనధ్యాస:- రాజా ముక్త్యాల వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం వేల ఎకరాలు భూమి దానం, చేశారు. ఆరోజుల్లోనే లక్షలాద్సి రూపాయలు ప్రాజెక్టు కోసం సహాయం చేసి, ప్రాజెక్టు నిర్మాణానికి కీలకపాత్ర వహించిన రాజా వారికి ఘన నివాళులర్పించారు. పల్నాడు ప్రజలందరు రాజా గారికి ఋణపడి ఉన్నారు. హృదయంలో ఆయనను దేవునిగా కొలుస్తారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంకు మూలం ఆ మహానుభావుడే. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నల్లగొండ, గుంటూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాల లో ప్రజలు ఈ రోజు సుభిక్షం గా పాడి పంటల తో ఉన్నారంటే వారే కారణం, వంశ పారం పర్యంగా వచ్చిన రాజరికంతో తృప్తి చెందలేదు. ప్రజలకు పది కాలాలు ఉపయోగపడాలన్న సదుద్దేశంతో, తన సొంత ఖర్చులతో వూరు వూరు తిరిగి రైతులను చైతన్యం చేసి కృష్ణా ఫార్మర్స్ సొసైటీ ని స్థాపించి నాగార్జున సాగర్ వద్ద( నంది కొండ వద్ద ) ఆనకట్ట కడితే బహుళార్ధసాధకంకా ఉపయోగపడి ఆనీటితో పంటలు పండించుకుని కరువులు దూరం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి అయి తెలుగునేల అన్నపూర్ణగా, భారత దేశ ధాన్యగారంగా మారుతుందని తలంచి, అనకట్టలు ఆధునిక దేవాలయాలని భావించి బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదించి నాగార్జున సాగర్ నిర్మాణం పై పాలకుల దృష్టి పడేలా చేశారు దేశానికి స్వాతంత్య్రం రావడంతో, కేంద్ర ప్రభుత్వం వద్దకు రైతులను పెద్ద సంఖ్యలో తీసుకెళ్లి గాంధీజీ నాటి ప్రధాని జవాహర్లాల్ నెహ్రు, పటేల్ దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ పరిశీలనకై ఒక ఖోస్లా కమిటీని నియమించింది. ఆనాడు కీకరణ్యంగా ఉన్న ప్రాజెక్ట్ ప్రదేశానికి తన సొంత ఖర్చులతో విజయవాడ నుండి దారి నిర్మించి వారికి ఆప్రదేశాన్ని, అక్కడి కృష్ణమ్మ జల సిరిని చూపి ఆ కమిటీని ఒప్పించి ప్రధాని జవాహర్లాల్ నెహ్రు గారితో 1955లో నాగార్జునసాగర్ నిర్మాణానికి పునాది రాయి వేయించి పూర్తి అయ్యే వరకు పర్యవేక్షించి దేశం లోని ఓ పెద్ద బహుళార్ధక ప్రాజెక్ట్ ను నిర్మింప జేసిన మహానుభావుడు. వారి దాన గుణానికి, ప్రాజెక్టు కోసం చేసిన కృషి కి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పక్కనే వారి విగ్రహం ఏర్పాటు చేసి శాశ్వత యశోకీర్తి పొందారు. ఈ నాలుగు జిల్లాలో ప్రజలు ఈరోజు అన్నం తింటున్నారంటే ఆమహాను భావుని చలవే, శ్రీ రాజా వాసిరెడ్డి గోపాలక్రిష్ణ మహేశ్వర ప్రసాద్, జగ్గయ్యపేట వద్ద గల ముక్త్యాల సంస్థనాధీశుడు, మనందరి దేవుడు మనం తినే ప్రతి మెతుకులో ఆయనను స్మరించుకోవాలి, 1972 లో స్వర్గస్థులైన రాజవాసిరెడ్డి గోపాలక్రిష్ణ మహేశ్వర ప్రసాద్ కిఘన నివాళులర్పించారు.