శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:-
విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగబోయే జనసేన విస్తృత స్థాయి సమావేశం “సేనతో–సేనాని” కార్యక్రమానికి చారిత్రాత్మక ప్రాధాన్యం లభించింది. ఈ మహాసభ వేదికకు మన్య వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పేరు ఇవ్వడం ప్రతి భారతీయునికి గర్వకారణమని ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కొత్తూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు & విజయవాడ డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులు గొర్లి నాగేశ్వరరావు వెల్లడించారు.ఈ విషయాన్ని ఆయన కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాలతో తెలియజేస్తూ మాట్లాడుతూ –“విదేశీ పాలకులపై పోరాడి, స్వాతంత్ర్యాన్ని సాధించడమే కాకుండా గిరిజన ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజు. ఇంతటి మహానుభావుని పేరుతో ఏర్పాటైన వేదికపై మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన కొణెదల పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేయడం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకం. ఈ వేదిక నుండి వెలువడే సందేశం రాబోయే రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేయనుంది” అని తెలిపారు.అల్లూరి సీతారామరాజు త్యాగాలను స్మరించుకుంటూ ఆయన పేర్కొంటూ –“స్వాతంత్ర్య సమరంలో అల్లూరి చూపిన ధైర్యం, త్యాగం, పట్టుదల మనకు నేడు ప్రేరణ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతి, శోషణలను ఎదుర్కొని ప్రజలకు న్యాయం చేయడం జనసేన శ్రేణుల ప్రధాన ధ్యేయం కావాలి. అల్లూరి వారసత్వాన్ని కొనసాగించడమే జనసేనకు నిజమైన గౌరవం అవుతుంది” అని చెప్పారు.కొత్తూరు, యూజెపురం ప్రాంతాల జనసేన నాయకులు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ వేదిక నుండి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే పిలుపు పార్టీ శ్రేణులకు శక్తినిచ్చి, ప్రజాసమస్యల పరిష్కారానికి దారితీయనుందని విశ్వాసం వ్యక్తం చేశారు.