శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:-
సేనాతో-సేనాని వేదికకు అల్లూరి నామకరణం గర్వించదగిన విషయం అని టిఏసి సభ్యులు మేకల కృష్ణ అన్నారు. విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 28- 30వ తేదీ వరకు జరిగే జనసేన విస్తృతస్థాయి సమావేశం సేనతో-సేనాని భారీ స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సభ వేదికకు మన్యంవీరుడు,విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం మన అందరికీ గర్వించదగ్గ విషయమని శంఖవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు, జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి బ్రిటీష్ పాలకులపై పోరాటం చేసి విదేశిపాలన నుండి భారతీయులను విముక్తులను చేయటానికి,మన ప్రాంతం గిరిజనప్రజల హక్కుల కోసం పోరాడిన యోధుడని బ్రిటిష్ వారిపై పోరాటంలో తన ప్రాణాలను సైతం ప్రణంగా పెట్టిన పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు అని అటువంటి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన వేదిక నుండి మా జనసేనపార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన కొణెదల పవన్ కళ్యాణ్ జనసేనపార్టీ శ్రేణులకు పార్టీ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేయడం ఎంతో ఆనందదాయకమని అదే విధంగా జనసేన శ్రేణులు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చెసి ప్రజలకు న్యాయం చేకూర్చాలని శంఖవరం గ్రామ జనసేనపార్టీ అధ్యక్షుడు,జిల్లాటెలికం టెలీకమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ తెలియజేశారు.