మాన ధ్యాస, నారయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం నారాయణ పేట జిల్లా మాగనూరు మండలం అమ్మపల్లి గ్రామంలో నూతనంగా రూపొందించిన ఓటర్ లిస్టును గ్రామపంచాయతీ కార్యదర్శి బి రవికుమార్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ప్రదర్శించడం జరిగిందని తెలిపారు, ఓటర్ లిస్టు వార్డులలో ఏమైనా పొరపాటు ఉంటే 30వ తేదీ వరకు గ్రామపంచాయతీలో సవరణకు దరఖాస్తు చేసుకోగలరని పేర్కొన్నారు, ఇంటి యొక్క అడ్రస్ ఏమైనా పొరపాట్లు ఉన్న స్థానికంగా ఉండే బూతు లెవల్ అధికారిని సంప్రదించి సరిచేసుకోవాలన్నారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేవారు మీ సేవలో అప్లై చేసుకుని సంబంధిత మండల ఎమ్మార్వో కార్యాలయంలో ఇవ్వగలరని తెలిపారు. గ్రామపంచాయతీలో ఉండే అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఓటర్ లిస్టులో ఏమైనా తప్పులున్న వెంటనే సవరించుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.