మన ధ్యాస ,నెల్లూరు ,ఆగస్టు 28: నగరంలోని పలు విగ్నేశ్వరులను దర్శించుకున్న మంత్రి నారాయణ సతీమణి రమాదేవి మనవళ్లు* విఘ్నాలు పోవాలి..విజయాలు రావాలి, ప్రజలకు హ్యాపీ వినాయక చవితి తెలిపిన మంత్రి* ఘనంగా స్వాగతం పలికిన మండపాల నిర్వాహకులు* విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వెయ్యాలి.ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఉండాలని వారంతా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా మంత్రి నారాయణ అయన సతీమణి రమాదేవి.. మనవళ్లు వేద్ ,ఇషాన్ తో కలిసి నెల్లూరు నగరంలోని పలు విగ్నేశ్వరుల మండపాలను దర్శించుకున్నారు.మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు వినాయక మండపాల నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.విఘ్నేశ్వరుడు దర్శించుకొని అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుని దీవెనలను మంత్రి నారాయణ కుటుంబం తీసుకుంది ముందుగా ములుముడి బస్టాండ్ సెంటర్లో శ్రీ గణేష్ మరాఠీ మిత్ర మండలి ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాన్ని దర్శించుకున్నారు అనంతరం శ్రీ రాజస్థానీ గణేష్ యువ మిత్ర మండలి ఏర్పాటు చేసిన మండపం, లస్సీ సెంటర్లోని శివాజీ మిత్రమండలి ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం ఓల్డ్ జెడ్పీ సెంటర్ ఝాన్సీ రాణి యువసేన ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం, పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని టిడిపి యూత్ ఏర్పాటుచేసిన విజ్ఞేశ్వర విగ్రహాన్ని దర్శించుకున్నారు.అనంతరం మంత్రి నారాయణ మీడియాతో...... మాట్లాడారు ప్రజలందరికీ సకలశుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేయాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి కోరారు. అనంతరం ప్రతి మండపం వద్ద మంత్రితో సెల్ఫీలు ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు..టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.