మన ధ్యాస ,నెల్లూరు/తిరుపతి ,ఆగస్టు 28 :రుమల శ్రీవారి సేవలో ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్,మంత్రి నారాయణ* భారతదేశం శక్తివంతంగా ఎదగాలి: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్* కంచిమఠాన్ని సందర్శించిన రాధాకృష్ణన్,నారాయణ* శేష వస్త్రంతో సత్కరించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్.ప్రపంచ దేశాలలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ తెలిపారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తో పాటు మంత్రి నారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణను శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.. ఆధ్యాత్మికత ఒక్కటే ఉన్నతమైన మానవ జీవన విధానమని, ఆధ్యాత్మికం వలన స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ సిద్ధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.స్వామి అనుగ్రహంతో దేశప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలోని కంచి మఠాన్ని సందర్శించారు. ఆయన వెంట మంత్రి నారాయణ, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహం పొంది ఆశీస్సులను అందుకున్నారు.తిరుమల, తిరుపతి పర్యటన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయనకు మంత్రి పి.నారాయణ, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ వీడ్కోలు పలికారు. బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. బీజేపీ నాయకులు, తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ,టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు.