మన ధ్యాస ,నెల్లూరు /ఢిల్లీ ,ఆగస్టు 28 : కొత్త షూస్ కలెక్షన్ విడుదల చేసిన ఎంఎస్ ధోనీ- నెల్లూరుకు చెందిన మకీనా వినయ్ కుమార్ చౌదరికి డిస్ట్రిబ్యూటర్ ఎక్సలెన్స్ అవార్డు- ఏషియన్ ఫుట్‌వేర్స్ భారీ విస్తరణ ప్రణాళిక- ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది వేల దుకాణాలు. భారత్‌లో వేగంగా ఎదుగుతున్న ఫుట్‌వేర్ బ్రాండ్లలో ఒకటైన ఏషియన్ ఫుట్‌వేర్స్ తన బ్రాండ్ అంబాసడర్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ చేతుల మీదుగా సిగ్నేచర్ రేంజ్ 'క్వాంటమ్ 2.0' పేరుతో కొత్త ప్రీమియం షూస్ కలెక్షన్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తరణ ప్రణాళికలను కూడా ప్రకటించింది. ప్రస్తుతం 3,000 రిటైల్ ఔట్లెట్ల నుంచి 8,000 దుకాణాలకు విస్తరించనుంది. ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్ల సంఖ్యను కూడా పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయనుంది. ఈ కొత్త ప్రీమియం షూస్ కలెక్షన్లో హైపర్ కుషన్, పవర్ కిక్, మోజో మోడల్స్ ఉన్నాయి. ఇవి అత్యాధునిక, బిఐఎస్ సర్టిఫైడ్ డిజైన్, టెస్టింగ్ ల్యాబ్‌లో ఇన్-హౌస్ డిజైన్ చేయబడ్డాయి. స్టైల్, పని తీరును సమపాళ్లలో ప్రతిబింబించే ఈ మోడల్స్ గ్లోబల్ లుక్ కోరుకునే వినియోగదారులకు అందుబాటు ధరలో ఉండనున్నాయి. ఈ కార్యక్రమంలో ఏషియన్ ఫుట్‌వేర్స్ ప్రధాన డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన నెల్లూరుకు చెందిన మకీనా వినయ్ కుమార్ చౌదరికి డిస్ట్రిబ్యూటర్ ఎక్సలెన్స్ అవార్డును ఎంఎస్ ధోనీ, ఏషియన్ ఫుట్‌వేర్స్ చైర్మన్ రాజీందర్ జిందాల్ చేతుల మీదుగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏషియన్ ఫుట్‌వేర్స్ వ్యాపారాన్ని బలోపేతం చేయడంలో, వినియోగదారుల అనుబంధాన్ని మరింతగా పెంచడంలో సంస్థ అభివృద్ధి ప్రయాణాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో వీరి పాత్ర ఎంతో విశేషమైంది. ఏషియన్ ఫుట్‌వేర్ దేశవ్యాప్తంగా తన కార్యకలాపాల విస్తరణ కోసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థ దేశంలో 30,000 మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లతో పాటు 35 ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్లను( ఈ బి ఓ )నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా తమ ఉనికిని 1 లక్ష రిటైల్ ఔట్లెట్లు, 100 ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్లకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో అందుబాటును పెంచడం ద్వారా, కొత్త కలెక్షన్లతో పాటు ఏషియన్ ఫుట్‌వేర్స్ వైవిధ్యమైన ఉత్పత్తులు దేశవ్యాప్తంగా లక్షలాది వినియోగదారులకు మరింత చేరువ కానున్నాయి.ఈ సందర్భంగా ఏషియన్ ఫుట్‌వేర్స్ చైర్మన్ రాజీందర్ జిందాల్ మాట్లాడుతూ.... మా కొత్త ప్రీమియం కలెక్షన్‌ను ఎం.ఎస్.ధోనీ ఆవిష్కరించడం భాగ్యంగా భావిస్తున్నామన్నారు. మా బ్రాండ్‌పై ఆయన చూపుతున్న విశ్వాసం ప్రతిరోజూ మేము మరింత ఉన్నతంగా ఎదగడానికి ప్రేరణ ఇస్తుందన్నారు. ఒక క్రీడాకారునికి పాదరక్షలు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసన్నారు. అలాంటి వ్యక్తి విశ్వాసం మాకు అపూర్వమైన నమ్మకం మరియు ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఈ కలెక్షన్ ఇన్నోవేషన్, పనితీరు, స్టైల్‌లను సమపాళ్లలో కలగలిపి భారతీయ వినియోగదారులకు ప్రపంచస్థాయి డిజైన్లను అందుబాటు ధరల్లో అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏషియన్ ఫుట్‌వేర్స్ బ్రాండ్ అంబాసడర్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ కాలక్రమేణా ఈ బ్రాండ్ ఎలా అభివృద్ధి చెందిందో, కొత్త ఆవిష్కరణలు ఎలా చేసిందో చూశానన్నారు. ఈ కొత్త షూస్ కలెక్షన్ ప్రారంభోత్సవంలో భాగమవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏషియన్ షూస్ ధరించడం ఇష్టమన్నారు. ఎందుకంటే, ఇవి కంఫర్ట్, మన్నిక, స్టైల్ ఈ మూడింటినీ కలిపి ఇస్తాయన్నారు.