మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఈనెల 21వ తేదీన గాలి తలుపులయ్య ఇంటిలో జరిగిన చోరీని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాలతో ప్రత్తిపాడు పోలీసులు వారం రోజులు వ్యవధిలో చేధించారు. గురువారం ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి వద్ద ఇద్దరు వ్యక్తులను అనుమానంగా తిరుగుతున్న వారిని ప్రత్తిపాడు పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు సూచనల మేరకు ఎస్సై లక్ష్మీకాంతం విచారణ చేపట్టారు.ధర్మవరం గ్రామంలో ఇంటిలో చోరీకి పాల్పడిన ముద్దాయిలుగా గుర్తించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు మాట్లాడుతూ చోరీకి పాల్పడిన ముద్దాయిలు రాజమండ్రి ప్రాంతానికి చెందిన కొవ్వూరి సునీల్, మోర్త దీవెనరాజులని గుర్తించి,వారి వద్దనుండి 247 గ్రాముల బంగారం,90 గ్రాముల వెండి, 3 గ్రాముల ప్లాటినం ఉంగరం,ఒక యమహా ఆర్ 15 బైక్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు.రికవరీ సొత్తు విలువ 6 లక్షల 30వేలు అని పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు తెలిపారు.వారం రోజులు వ్యవధిలో కేసు చేధించిన ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీ కాంతంతో పాటు సిబ్బంది ఎం.గోవింద్ బాబు,కె. గోవింద్,ఎస్ వెంకటరమణ,కె.శివరామకృష్ణ, నాగేశ్వరరావులని డిఎస్పి శ్రీహరి రాజు అభినందించారు.