మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్, అక్షయ్లతో మాట్లాడి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహం, ప్రాజెక్టులోకి చేరుతున్న నీటి పరిమాణం, ప్రస్తుత ఇన్ఫ్లో, ఔట్లెట్ల ద్వారా విడుదల అవుతున్న క్యూసెక్కుల వివరాలను తెలుసుకున్నారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని షిండే సూచించారు.మాజీ ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి, అచ్చంపేట సింగిల్ విండో చైర్మన్ నరసింహారెడ్డి, నాయకులు రమేష్ గౌడ్, గరబోయిన వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.