కలిగిరి:మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు : ////
కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం పంచాయతీ నర్సారెడ్డిపాలెం లో ఇటీవలే మృతి చెందిన టిడిపి సీనియర్ నాయకులు వింత కృష్ణారెడ్డి, తిమ్మసముద్రం పెద్ద లక్ష్మయ్య కుటుంబాలను టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన మాట్లాడుతూ, ఒక్కసారిగా ఇద్దరు నిబద్ధత కలిగిన టిడిపి కార్యకర్తలను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఈ కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.లక్ష్మయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని పార్టీ నాయకులు తెలియజేయడంతో, వెంటనే స్పందించిన బొల్లినేని వెంకటరామారావు గారు ఆ కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ ఇద్దరు నాయకుల మరణం తనను కలచివేసిందని భావోద్వేగంతో తెలిపారు.