కలిగిరి: మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు :///
సీనియర్ టిడిపి నాయకుడు,కలిగిరి మండల కేంద్రానికి చెందిన ఇంగ్లే కల్లయ్య దశదినకర్మ కార్యక్రమంలో టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కల్లయ్య గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన బొల్లినేని వెంకటరామారావు, వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ పట్ల కల్లయ్య గారి అంకితభావం, సేవా తపన ఎప్పటికీ మరువలేనిదని గుర్తు చేశారు.ఇంగ్లే కల్లయ్య లాంటి నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోవడం టిడిపికి మాత్రమే కాకుండా మొత్తం మండలానికి తీరని లోటు” అని బొల్లినేని వెంకటరామారావు గారు పేర్కొన్నారు. ఇలాంటి సీనియర్ కార్యకర్తల త్యాగమే పార్టీకి బలమని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.